29న ప్రారంభం కాబోతోన్న బాలయ్య.. ఎన్టీఆర్ మూవీ
- March 04, 2018
నటసింహం బాలకృష్ణ తీయబోతున్న NTR సినిమా ఈనెల 29న ప్రారంభం కాబోతోంది. ఈ విషయాన్ని బాలయ్య స్వయంగా చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు అమరావతి వచ్చిన ఆయన.. మీడియాతో చిట్‌చాట్ చేశారు. హైదరాబాద్‌లోని రామకృష్ణ సినీ స్టూడియోస్‌లో సినిమా ప్రారంభిస్తామని బాలయ్య చెప్పారు. 2019 సంక్రాంతికి విడుదల అవుతుందన్నారు. అలాగని.. ఎన్నికల సందర్భంగా తీస్తున్న సినిమా కాదన్నారాయన.
నందమూరి తారక రామారావు జీవితచరిత్ర ఆధారంగా తీస్తున్న సినిమా కాబట్టి.. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు బాలయ్య చెప్పారు. టైటిల్‌కు చాలామంది చాలా పేర్లు సూచించారని.. NTRకు మించిన పేరు లేదని భావించామని అన్నారు. NTRను పార్టీలకు అతీతంగా అందరూ అభినందించారని బాలయ్య గుర్తుచేశారు. కొన్నాళ్ల క్రితం భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న బాలకృష్ణ.. ఆ కట్టుతోనే అసెంబ్లీకి వచ్చారు. ఆయన్ని ఎమ్మెల్యేలంతా పరామర్శించారు. తగిలిన ఎన్నో దెబ్బలతో పోల్చితే ఇది పెద్ద దెబ్బ కాదని చెప్పిన బాలకృష్ణ.. ఈ నెల 31, ఏప్రిల్ 1 న లేపాక్షి ఉత్సవాలు నిర్వహిస్తాం అని చెప్పారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







