దుబాయ్‌లో మూడేళ్ళపాటు ఫీజులు పెరగవ్‌: షేక్‌ హమదాన్‌

- March 05, 2018 , by Maagulf
దుబాయ్‌లో మూడేళ్ళపాటు ఫీజులు పెరగవ్‌: షేక్‌ హమదాన్‌

దుబాయ్‌ ప్రభుత్వం, రానున్న మూడేళ్ళలో పబ్లిక్‌ సర్వీసెస్‌కి సంబంధించిన ఫీజుల్ని పెంచబోదని షేక్‌ హమదాన్‌ ప్రకటించారు. దుబాయ్‌ క్రౌన్‌ ప్రిన్స్‌, దుబాయ్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ షేక్‌ హమదాన్‌ ఈ మేరకు ఓ ఆర్డర్‌ని పాస్‌ చేయగా, అది ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. దుబాయ్‌ రూలర్‌, యూఏఈ ప్రైమ్‌ మినిస్టర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మొహమమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ డైరెక్షన్స్‌ నేపథ్యంలో ఈ ఆర్డర్‌ని విడుదల చేశారు. పౌరుల సోషల్‌ స్టెబిలిటీకి మద్దతుగా ఈ చర్య తీసుకున్నట్లు షేక్‌ హమదాన్‌ వివరించారు. దుబాయ్‌ ఎకనమిక్‌ కాంపిటీటివ్‌నెస్‌ని కూడా ఈ నిర్ణయం పెంచుతుందని ఆయన చెప్పారు. ఫిబ్రవరి 28న యూఏఈ క్యాబినెట్‌ సమావేశం జరగ్గా, ఈ సమావేశంలో 'మూడేళ్ళ పాటు ఫీజులు పెంచకూడదు' అనే నిర్ణయం తీసుకున్నట్లు షేక్‌ మొహమ్మద్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. పౌరులు, రెసిడెంట్స్‌ యొక్క ఎకనమిక్‌ స్టెబలిటీనే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారాయన. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com