రస్ అల్ ఖైమాలో వన్ స్టాప్ ట్రక్ ఇన్స్పెక్షన్'
- March 05, 2018
రస్ అల్ ఖైమా పోలీసులు కొత్తగా ఇన్స్పెక్షన్ స్టేషన్‌ని హెవీ ట్రక్స్ కోసం సయీదీ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ప్రొసిడ్యూర్స్‌ని యూనిఫై చేయడం, సమయాన్ని తగ్గించడం ఈ స్టేషన్ లక్ష్యమని అధికారులు వెల్లడించారు. టైపింగ్, పొటో కాపీయింగ్ సర్వీసులు, పీ పేమెంట్, ఇతర టెక్నికల్ ఇన్స్పెక్షన్స్, చెకప్స్ ఈ స్టేషన్లో అందుబాటులో ఉంటాయని రస్ అల్ ఖైమా జనరల్ రిసోర్సెస్ ఛైర్మన్ బ్రిగేడియర్ జమాల్ అహ్మద్ తెలిపారు. లైసెన్సింగ్ సర్వీసుల కోసం అదనపు కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. తమ అవసరాల కోసం పలు చోట్ల తిరగాల్సిన పనిలేకుండా, ఇక్కడే అన్ని సేవలూ పొందవచ్చు. జోర్డాన్‌కి చెందిన అష్రాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ, గతంలో తాను రిజిస్ట్రేషన్ కోసం మూడు గంటల సమయం వేచి చూడాల్సి వచ్చేదనీ, ఇప్పుడు చాలా తక్కువ సమయంలోనే తన పని అయిపోతోందని చెప్పారు. ట్రక్ డ్రైవర్లకు ఈ స్టేషన్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఈజిప్ట్‌కి చెందిన మొహమ్మద్ ఇబ్రహీమ్ అన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







