దుబాయ్ సఫారీలో 175 కొత్త యానిమల్స్
- March 05, 2018
దుబాయ్ సఫారీ, యూఏఈలోనే ప్రత్యేకమైనదిగా అతి తక్కువ కాలంలోనే గుర్తింపు పొందింది. కొత్తంగా 30 జాతులకు చెందిన 175 న్యూ బోర్న్స్ ఇకపై సఫారీలో కనువిందు చేయనున్నాయి. ప్రపంచ స్థాయి వైల్డ్ లైఫ్ పార్క్ అయిన దుబాయ్ సఫారీలో, ఓ వెల్వెట్ మంకీ, 22 బ్లాక్ బక్ యాంటీలోప్స్, 3 అరేబియన్ వూల్వ్స్, 12 కార్న్ స్నేక్స్, 2 నైల్ క్రోకడైల్స్, 5 ఈజిప్టికన్ ఫ్రూట్ బ్యాట్స్, 6 వుడ్ డక్స్, 24 ఆఫ్రికన్ స్పర్డ్ టార్టాయిస్‌లు, 3 ఆఫ్రికన్ వైట్ లయన్స్ కొత్తగా వచ్చి చేరాయి. కొత్తగా చేరిన 175 జంతువులతో, దుబాయ్ సఫారీలో జంతువుల సంఖ్య గణనీయంగా పెరిగిందని దుబాయ్ మునిసిపాలిటీ డైరెక్టర్ ఆఫ్ లీజర్ ఫెసిలిటీస్ ఖాలిద్ అల్ సువైది చెప్పారు. అత్యంత అరుదైన జంతువుల్ని సఫారీలో చూసే అవకాశం సందర్శకులకు కలుగుతోందని ఆయన చెప్పారు. డిసెంబర్‌లో ఈ సఫారీ సందర్శకులకు అందుబాటులోకి వచ్చింది.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







