రాహుల్ గాంధీ మళ్లీ విదేశాలకు....

- March 05, 2018 , by Maagulf
రాహుల్ గాంధీ మళ్లీ విదేశాలకు....

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విదేశాలకు పయనమవుతున్నారు. కొద్దిరోజుల పాటు తాను విదేశాలకు వెళ్తున్నట్టు రాహుల్ సోమవారంనాడు ట్విట్టర్‌లో తెలిపారు. అయితే తాను ఏ దేశానికి వెళ్తున్నాననేది ఆయన స్పష్టం చేయలేదు. 46వ పుట్టినరోజు సందర్భంగా తనను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ఆ ట్వీట్‌లో రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్ గత ఏడాది కూడా గుట్టుచప్పుడు కాకుండా 56 రోజుల పాటు విదేశాలకు వెళ్లారు. ముఖ్యంగా బడ్జెట్ సమావేశాల మధ్యలో ఆయన ఆచూకీ లేకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com