లసా వైరస్.. భయపెడుతున్న మరో ప్రాణాంతక వ్యాధి

- March 06, 2018 , by Maagulf
లసా వైరస్.. భయపెడుతున్న మరో ప్రాణాంతక వ్యాధి

అనేక రకాల వ్యాధులకు మందిచ్చే వైద్యుడు సైతం ఈ వ్యాది బారిన పడుతున్నాడు. నైజీరియాలో మొదలైన ఈ ప్రాణాంతక వ్యాధి ప్రపంచమంతా విస్తరిస్తోంది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ గణాంకాల ప్రకారం జనవరి నుంచి ఇప్పటి వరకు నైజీరియాలో 1000 లసా కేసులు నమోదయ్యాయి. గర్భిణులకు ఈ వ్యాధి సోకితే కడుపులోని బిడ్డ చనిపోవడం జరుగుతోంది. ఈ వ్యాధికి ఇంత వరకు వ్యాక్సిన్ కనిపెట్టలేక పోతున్నారు వైద్యులు. శరీరంలోని అనేక భాగాలపై ప్రభావం చూపిస్తున్న ఈ వ్యాధి శరీరంలోని రక్తనాళాలను ధ్వంసం చేస్తోంది. 

జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కూడా మలేరియా, డెంగ్యూ వ్యాధి లక్షణాల మాదిరిగానే ఉంటుంది. ఈ వ్యాధిని నిర్థారించే ల్యాబ్‌లు చాలా పరిమితంగా ఉన్నాయి. ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే 90మంది మృత్యువాత పడ్డారు. నైజీరియా తరువాత ఈ వ్యాధి పశ్చిమాఫ్రికా దేశాలకు కూడా విస్తరిస్తోంది. వాతావరణ మార్పుల వల్ల ఇది విస్తరిస్తోందని తెలిసినా వ్యాధి ప్రభలడానికి గల మూలకారణాలను గుర్తించలేకపోతున్నారు. ఎలుకలు, ఇతర క్షీరదాల వల్ల ఇది మనుషులకు ఎక్కువగా సోకుతుంది. వైద్యం చేసే నర్సులు, డాక్టర్లు కూడా ఈ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com