సిరియాలో కూలిన విమానం, 32మంది మృతి

- March 06, 2018 , by Maagulf
సిరియాలో కూలిన విమానం, 32మంది మృతి

రష్యాకు చెందిన విమానం సిరియాలో కూలిపోయింది. ఈ విమానంలో ఉన్న 26 మంది ప్రయాణికులు.. ఆరుగురు సిబ్బంది చనిపోయారని రష్యా రక్షణ శాఖ తెలిపింది.

సిరియా తీర ప్రాంత నగరం లటాకియాలోని మీమిమ్ ఎయిర్ బేస్‌లో ఈ An-26 విమానం దిగుతుండగా ప్రమాదం జరిగింది.

ఈ మేరకు రష్యా అధికారులు తెలిపినట్లు అక్కడి మీడియా పేర్కొంది.

ఈ విమాన ప్రమాదానికి సాంకేతిక లోపాలే కారణమని భావిస్తున్నట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.ఈ ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు జరుగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com