పాకిస్తానీ ఖైదీ కోసం బ్లడ్‌ మనీ చెల్లించిన నలుగురు డోనర్స్‌

- March 07, 2018 , by Maagulf
పాకిస్తానీ ఖైదీ కోసం బ్లడ్‌ మనీ చెల్లించిన నలుగురు డోనర్స్‌

రాస్ అల్ ఖైమా:నలుగురు 'గుడ్‌ సమరిటన్స్‌', పాకిస్తానీ ఖైదీ కోసం 100,000 దిర్హామ్‌లను బ్లడ్‌ మనీగా చెల్లించేందుకు ముందుకొచ్చారు. పాకిస్తానీ ఖైదీకి సంబంధించిన విషయాన్ని తెలుసుకుని, నలుగురు అజ్ఞాత డోనర్స్‌ ఈ మొత్తాన్ని సమీకరించారు. ఇందులో ఒకరు 60,000, మరొకరు 20,000 చెల్లించగా, మరో ఇద్దరు 10,000 దిర్హామ్‌ల చొప్పున హాట్‌లైన్‌ ద్వారా అందించారు. ఓ వ్యక్తి హత్య కేసులో 40 ఏళ్ళ పాకిస్తానీ వ్యక్తి జైల్లో మగ్గుతున్నాడు. హజి ప్రమాదవశాత్తూ ట్రక్‌ని, ఓ వ్యక్తిపైకి ఎక్కించేశాడు. ఈ ఘటన ఏడు నెలల క్రితం జరిగింది. రస్‌ అల్‌ ఖైమాలోని ఓ ప్రాంతంలో హజి తన ట్రక్‌ని పార్కింగ్‌ చేశాడు. ఆ ట్రక్‌ కింద ఆసియాకి చెందిన వ్యక్తి రెస్ట్‌ తీసుకుంటుండగా, అది గమనించని హజి, వాహనాన్ని నడపడంతో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం 100,000 బ్లడ్‌ మనీని బాధిత కుటుంబానికి చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com