అబుదాబీ పార్క్స్‌లో 39 బిబిక్యు యూనిట్స్‌

- March 07, 2018 , by Maagulf
అబుదాబీ పార్క్స్‌లో 39 బిబిక్యు యూనిట్స్‌

అబుదాబి:అబుదాబీలోని పార్క్స్‌ ఇకపై బిబిక్యు ప్రేమికులకు హాట్‌ స్పాట్స్‌గా మారబోతున్నాయి. మొత్తం 39 ఫ్రీ గ్రిల్లింగ్‌ యూనిట్స్‌ని పార్క్‌లలో ఏర్పాటు చేసేందుకు అబుదాబీ మునిసిపాలిటీ సన్నాహాలు చేస్తోంది. డాల్ఫిన్‌ పార్క్‌ -స్టర్న్‌ మేన్‌గ్రోవ్స్‌ కోర్నిచ్‌లో 15 బార్బిక్యూ యూనిట్స్‌, అలాగే అబుదాబీ కోర్నిచ్‌లోని పార్క్‌లలో 24 యూనిట్స్‌ ఏర్పాటు చేసేందుకు ఓ ప్రాజెక్ట్‌ని ప్రారంభించారు. అగ్రికల్చరల్‌ ఎస్సెట్స్‌, అలాగే సైడ్‌ వాక్స్‌ని బార్బిక్యూస్‌ కోసం సందర్శకులు పాడు చేయకుండా ఈ ప్రాజెక్ట్‌కి రూపకల్పన చేశారు. సందర్శనీయ స్థలాల్ని ఆకర్షణీయంగా కొనసాగించేందుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు అంటున్నారు. 2018 రెండో క్వార్టర్‌ నాటికి ఈ బార్బిక్యూ యూనిట్స్‌ పూర్తవుతాయి. ప్రయోగాత్మకంగా డాల్ఫిన్‌ పార్క్‌లో ఐదు యూనిట్స్‌ని ప్రారంభించారు. హెరిటేజ్‌ పార్క్‌, ఫార్మల్‌ పార్క్‌, ప్యామిలీ పార్క్‌లలో బార్బిక్యూలపై నిషేధం వుంది. షిషా స్మోకింగ్‌పైనా ఈ పార్క్‌లలో నిషేధం అమల్లో ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com