భారత పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ 40 బిలియన్ల డాలర్ల సంపదతో ఫోర్బ్స్ జాబితాలో 19వ స్థానం
- March 07, 2018
ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలోకి భారత పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ 40 బిలియన్ల డాలర్ల సంపదతో ఫోర్బ్స్ జాబితాలో 19వ స్థానం దక్కించుకున్నారు. అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ తొలి స్థానంలో నిలిచారు. ఆయన 112 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో అగ్ర స్థానాన్ని గెలుపొందారు . అమెజాన్ షేర్ల విలువ భారీగా పెరగడంతో..బెజోస్ సంపద ఏడాది కాలంలో ఏకంగా 39 బిలియన్ డాలర్లు పెరిగింది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ఈ జాబితాలో రెండో స్థానంకు పడిపోయారు. ఆయన సంపద 90 బిలియన్ డాలర్లుగా ఉంది. మొదటి, రెండు స్థానాల్లో ఉన్న వారి మధ్య అంతరం ఈ స్థాయిలో ఉండటం.. 2001 తర్వాత ఇదే తొలిసారని ఫోర్బ్స్ తెలిపింది.వారెన్ బఫెట్ 84 బిలియన్ డాలర్ల సంపదతో ఫోర్బ్స్ జాబితాలో మూడోస్థానంలో నిలిచారు.72 బిలియన్ డాలర్ల సంపదతో బెర్నార్డ్ ఆర్నాల్ట్ నాలుగో స్థానంలో ఉన్నారు. బెర్నార్డ్ యూరోప్ లోకెల్లా సంపన్నుడిగా అవతరించారు. ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ 71 బిలియన్ డాలర్లతో టాప్-5లో నిలిచారు.అదేవిధంగా భారతదేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఫోర్బ్స్ జాబితాలో 19వ స్థానం దక్కించుకున్నారు. ఆయన ఆస్తుల విలువ 40.1 బిలియన్ డాలర్లుగా ఉంది. విప్రో అధినేత అజీమ్ ప్రేమ్జీ 18.8 బిలియన్ డాలర్ల సంపదతో ఫోర్బ్స్-ప్రముఖ100 బిలియనీర్ల జాబితాలో నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా 72 దేశాల్లో 2208 మంది బిలియనీర్లు ఉన్నారని ఫోర్బ్స్-2018 నివేదిక తెలిపింది. ఈ ఏడాది హంగేరీ, జింబాబ్వే దేశాల నుంచి కొత్తగా ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. అమెరికాలో 585 మంది బిలియనీర్లు ఉండగా.. చైనాలో 373 మంది ఉన్నారు. 119 మంది భారతీయులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. క్రిప్టో కరెన్సీ పుణ్యామని కొత్తగా 259 మందికి ఈ జాబితాలో చోటు దక్కింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!