సహోద్యోగిని ముద్దు పెట్టి చిక్కుల్లో పడ్డ సూపర్వైజర్
- March 07, 2018
దుబాయ్:33 ఏళ్ళ ఫిలిప్పినో రెసిడెంట్, తన సహోద్యోగిని ముద్దు పెట్టుకున్న కేసులో విచారణను ఎదుర్కొంటున్నాడు. 24 ఏళ్ళ బాధితురాలు, ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. 2017 డిసెంబర్ 31న ,అల్ రసిదియా మెట్రో స్టేషన్‌కి వెళ్ళి, అక్కడ క్లయింట్‌ని కలవాలనుకున్నామనీ, క్రమంలో తన సూపర్ వైజర్, తనకు ఓ బహుమతినిస్తానని చెప్పి, కళ్ళు మూసుకోమన్నాడనీ, ఆ వెంటనే అతను హెయిర్ క్లిప్స్‌ని తనకు అందించాడనీ. ఆ తర్వాత మరో బహుమతి ఇస్తానని చెప్పి, కళ్ళు మూసుకోమన్నాడనీ, అయితే ఈసారి తనను అతను ముద్దుపెట్టుకున్నాడని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ఆ తర్వాత అక్కడినుంచి ఆమె వెళ్ళిపోయిందుకు ప్రయత్నించగా, వెంటపడి క్షమాపణ కోరాడని, తనను ప్రేమిస్తున్నానని చెప్పాడనీ, అయితే బాధితురాలు తమకు ఫిర్యాదు చేసిందని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







