సహోద్యోగిని ముద్దు పెట్టి చిక్కుల్లో పడ్డ సూపర్‌వైజర్‌

- March 07, 2018 , by Maagulf
సహోద్యోగిని ముద్దు పెట్టి చిక్కుల్లో పడ్డ సూపర్‌వైజర్‌

దుబాయ్:33 ఏళ్ళ ఫిలిప్పినో రెసిడెంట్‌, తన సహోద్యోగిని ముద్దు పెట్టుకున్న కేసులో విచారణను ఎదుర్కొంటున్నాడు. 24 ఏళ్ళ బాధితురాలు, ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. 2017 డిసెంబర్‌ 31న ,అల్‌ రసిదియా మెట్రో స్టేషన్‌కి వెళ్ళి, అక్కడ క్లయింట్‌ని కలవాలనుకున్నామనీ, క్రమంలో తన సూపర్‌ వైజర్‌, తనకు ఓ బహుమతినిస్తానని చెప్పి, కళ్ళు మూసుకోమన్నాడనీ, ఆ వెంటనే అతను హెయిర్‌ క్లిప్స్‌ని తనకు అందించాడనీ. ఆ తర్వాత మరో బహుమతి ఇస్తానని చెప్పి, కళ్ళు మూసుకోమన్నాడనీ, అయితే ఈసారి తనను అతను ముద్దుపెట్టుకున్నాడని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ఆ తర్వాత అక్కడినుంచి ఆమె వెళ్ళిపోయిందుకు ప్రయత్నించగా, వెంటపడి క్షమాపణ కోరాడని, తనను ప్రేమిస్తున్నానని చెప్పాడనీ, అయితే బాధితురాలు తమకు ఫిర్యాదు చేసిందని పోలీసులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com