విద్యుత్ వైరింగ్ మంటలు వెలువడి పొగతో ఉక్కిరిబిక్కిరైన భార్యాభర్తలు

- March 07, 2018 , by Maagulf
విద్యుత్ వైరింగ్ మంటలు వెలువడి పొగతో ఉక్కిరిబిక్కిరైన భార్యాభర్తలు

కువైట్:స్థానిక సభైయా లోని ఒక అపార్ట్మెంట్ తప్పిదమైన విద్యుత్ వైరింగ్ చేయడంతో షార్ట్ కట్ ఏర్పడి అగ్నిప్రమాదం సంభవించింది. ఆ అగ్ని ప్రమాదంలో దట్టంగా పొగలు ఇంట్లో అలుముకోవడంతో వారు ఊపిరి తీసుకోలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకొన్నఅగ్నిమాపక మరియు పారామెడిక్స్ స్పందించాయి. మంటలు వ్యాపించిన ఆ  అపార్ట్మెంట్లో ఉన్న ఆ జంటను కనుగొన్నారు, వారిని రక్షించి అడన్ ఆసుపత్రికి తరలించారు. అగ్నిప్రమాదం కారణంగా పూర్తిగా అపార్ట్మెంట్  తగలబడిపోయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com