సిరియాలో తక్షణమే కాల్పుల విరమణను అమలు చేయాలని ఐక్యరాజ్య సమితి డిమాండ్‌..

- March 08, 2018 , by Maagulf
సిరియాలో తక్షణమే కాల్పుల విరమణను అమలు చేయాలని ఐక్యరాజ్య సమితి డిమాండ్‌..

ఐక్యరాజ్య సమితి : సిరియాలో తక్షణమే కాల్పుల విరమణను అమలు చేయాలని ఐక్యరాజ్య సమితి డిమాండ్‌ చేస్తోంది. ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానం 2401ని అమలు చేయాలని పిలుపిచ్చింది. సిరియాలో నెలకొన్న దుర్బర పరిస్థితుల పట్ల భద్రతా మండలి సభ్యులు ఆందోళన వెలిబుచ్చారు. అక్కడ ఘర్షణల విరమణపై చర్చ జరగాలని కోరారు. జనాంతిక చర్చల అనంతరం భద్రతా మండలి అధ్యక్షుడు, ఐరాసలో డచ్‌ రాయబారి కరేల్‌ వన్‌ ఊస్టరామ్‌ మాట్లాడుతూ పై డిమాండ్‌ చేశారు. అంతకుమించి సమావేశం వివరాలు వెల్లడించలేదు. ఫిబ్రవరి 24న ఏకగ్రీవంగా ఆమోదించిన 2401 తీర్మానాన్ని అమలు చేయడంలో జరిగిన వైఫల్యాన్ని చర్చించేందుకు తక్షణమే సమావేశం జరగాలని ఫ్రాన్స్‌, బ్రిటన్‌లు కోరాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com