వైఎస్ఆర్ బయోపిక్‌లో నయనతార
- March 08, 2018
ఎన్టీఆర్ బయోపిక్‌కి చర్చలు నడుస్తున్న తరుణంలో తెరపైకి వైఎస్ఆర్ కూడా వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న తెలుగు రాష్ట్రాన్ని రెండు సార్లు పాలించిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం చెందారు. ఇప్పుడు ఆయనపై కూడా బయోపిక్‌ని తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆనందో బ్రహ్మ చిత్రంతో సక్సెస్ సాధించిన దర్శకుడు మహి రాఘవ డైరక్షన్లో ఈ చిత్రం రాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం నటీ నటుల వేటలో ఉన్న ఈ చిత్రానికి వైఎస్ ఆర్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని తీసుకోవాలని అనుకున్నట్లు తెలుస్తోంది. అయితే మమ్ముట్టి సరసన నయన్‌ని ఎంపిక చేసే ఆలోచనలో ఉంది చిత్ర యూనిట్. నయనతార చిరంజీవి పక్కన హీరోయిన్గా సైరాకి కూడా సైన్ చేసింది. పలు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడికి తెలుగులో అభిమానులు బాగానే ఉన్నారు. అదే వైఎస్ ఆర్ చిత్రంలో ఎంపికకు దారి తీసింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







