అమెరికా లో భారీ మంచు తుఫాన్...
- March 08, 2018
అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాలను మంచుతుఫాన్ వణికిస్తోంది. గత కొద్దిరోజులుగా కురుస్తున్నమంచుకారణంగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కడ చూసినా పేరుకుపోయిన మంచే కనిపిస్తోంది. గత కొద్దిరోజులుగా జనం ఇళ్లకే పరిమితయ్యారు. న్యూయార్క్ లో 10 అంగులాల మేర మంచుపేరుకుపోగా.. న్యూజెర్సీ, కనెక్ట్ కట్ లో రికార్డు స్థాయిలో 20 అంగులాల మేర మంచు పడిందని అధికారులు వెల్లడించారు. తీవ్రంగా కురుస్తున్నమంచుకారణంగా రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. ఇక న్యూయార్క్, న్యూజెర్సీ ఎయిర్ పోర్టుల్లో వేలాది విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. బలంగా వీస్తున్న గాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







