ఇతని ఆచూకీ చెప్పిన వారికి.. రూ.32.56 కోట్లు
- March 09, 2018
తెహ్రీక్ యే తాలిబన్ ఉగ్రవాది మౌలానా ఫజలుల్లాపై అమెరికా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఎవరైనా అతని గురించి సమాచారమిస్తే రూ.32.56 భారీ నజరానా ఇస్తామని తెలిపింది. గతకొన్నేళ్లుగా ఉగ్రవాది మౌలానా ఫజలుల్లాపై అమెరికా పలు విధాలుగా సమాచారం సేకరించాలని ప్రయత్నించింది. కానీ అవేవి ఫలించలేదు దీంతో ఈ ప్రకటన చేసింది అమెరికా. కాగా 2016 లో పెషావర్ ఆర్మీ స్కూల్‌పై జరిగిన దాడిలో సూత్రధారిగా ఉన్నాడు మౌలానా ఫజలుల్లా.. ఆ దాడిలో సుమారు 150 మంది చిన్నారులు చనిపోయారు. అంతేకాదు 2011 లో నోబెల్ శాంతి అవార్డు గ్రహీత మలాలా పై కూడా దాడి చేసింది ఈ ఉగ్రవాదే.. అలాగే ఇతనితోపాటు మరో ఇద్దరిపై కూడా అమెరికా నజరానా ప్రకటించింది. లష్కరే సంస్థకు చెందిన అబ్దుల్ వాలీ, మంగల్ భాగ్‌లను పట్టిస్తే 20 కోట్లు అందజేస్తామని ప్రకటించింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







