బిపిఎల్‌ 2018: ఇండియన్‌ క్రికెటర్‌ ప్రశంసలు

- March 09, 2018 , by Maagulf
బిపిఎల్‌ 2018: ఇండియన్‌ క్రికెటర్‌ ప్రశంసలు

భారత క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌, బహ్రెయిన్‌లో జరుగుతున్న కోకాకోలా బహ్రెయిన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2018 నిర్వహణ పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్పెసలిస్ట్‌ స్పిన్నర్‌గా హర్భజన్‌ సింగ్‌, భారత క్రికెట్‌కి విశేషమైన సేవలందించిన సంగతి తెల్సిందే. బహ్రెయిన్‌లో కెహెచ్‌కె స్పోర్ట్స్‌, ఎక్సెలాన్‌ సహకారంతో తొలి టీ20 క్రికెట్‌ టోర్నమెంట్‌ని నిర్వహించింది. బహ్రెయిన్‌లో యువ క్రికెటర్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ టోర్నమెంట్‌ని నిర్వహిస్తున్నారు. ఈ ఆలోచనని హర్భజన్‌సింగ్‌ అభినందించాడు. సుప్రీం కౌన్సిల్‌ ఫర్‌ యూత్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ఫస్ట్‌ డిప్యూటీ ఛైర్మన్‌, బహ్రెయిన్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఖాలిద్‌ బిన్‌ హమాద్‌ అల్‌ ఖలీఫా సమక్షంలో ఈ పోటీలు జరిగాయి. టీ20 ఫార్మాట్‌లో 13 రెసిడెంట్‌ క్రికెటర్స్‌తో ఆరు ఫ్రాంచైజీ స్క్వాడ్స్‌తో బహ్రెయిన్‌ ప్రీమియర్‌ లీగ్‌ జరిగింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com