ఇండియా, ఫ్రాన్స్ మధ్య చారిత్రక సత్సంబంధాలు ఉన్నాయి:ఫ్రాన్స్ అధ్యక్షుడు

- March 10, 2018 , by Maagulf
ఇండియా, ఫ్రాన్స్ మధ్య చారిత్రక సత్సంబంధాలు ఉన్నాయి:ఫ్రాన్స్ అధ్యక్షుడు
ఇండియా, ఫ్రాన్స్ మధ్య మంచి కెమిస్ట్రీ ఉందన్నారు ఆదేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్. రెండు ప్రజాస్వామ్య దేశాలు చారిత్రక సత్సంబంధాలను కలిగిఉన్నాయని అన్నారు. భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌ దంపతులకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఆయన సతీమణి సవితా కోవింద్‌,  ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక స్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్‌లో ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు. తరువాత మేక్రాన్.. భారత త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత మెక్రాన్ దంపతులు రాజ్‌ఘాట్‌ చేరుకుని జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు.

మేక్రాన్‌ నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. ద్వైపాక్షిక ఆర్థిక, రాజకీయ సంబంధాల బలోపేతంపై భారత్, ఫ్రాన్స్ ఒప్పందాలు చేసుకోనున్నాయి. అలాగే ఫ్రాన్స్‌ సహకారంతో జైతాపూర్‌లో నిర్మితమవుతున్న అణు విద్యుత్‌ కర్మాగారంపై రెండు దేశాల మధ్య ఒప్పంద సంతకాలు జరిగే అవకాశాముందని విదేశాంగ శాఖ తెలిపింది. మరోవైపు భారత్‌-ఫ్రాన్స్‌ దేశాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ఆవిర్భావ సదస్సుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఢిల్లీ వేదికగా ఈ నెల 11న ఈ సదస్సు జరగనుంది. ఇందులో మొత్తం 23దేశాల అధినేతలు, ప్రతినిధులు పాల్గొంటారు.  

 

 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com