ఎమ్మెల్యే కు డేట్ ఫిక్స్
- March 11, 2018
సమ్మర్లో సందడి చేయడానికి నందమూరి ఎమ్.ఎల్.ఎ రెడీ అవుతున్నాడు. కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఎమ్.ఎల్.ఎ మూవీ ఈ నెల 23న విడుదలవుతోంది. రిలీజ్ కి ఇంకా తక్కువ టైమే ఉండటంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తోంది ఎమ్.ఎల్.ఎ టీమ్. ఈ సినిమా ఆడియో రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేశారు.
కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ఎమ్.ఎల్.ఎ. మంచి లక్షణాలున్న అబ్బాయి అనేది క్యాప్షన్. విశ్వప్రసాద్, భరత్ చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి ఉపేంద్ర మాధవ్ దర్శకుడు. ఈ మూవీ సమ్మర్ కానుకగా ఈ నెల 23న విడుదలవుతోంది.
ఎమ్.ఎల్.ఎ మూవీలో కళ్యాణ్ రామ్ కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మొదటి సినిమా లక్ష్మీకళ్యాణం తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకు కళ్యాణ్ రామ్ తో జోడీ కట్టింది కాజల్. ఇందులో బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన చేసే కామెడీ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ అంటోంది టీమ్.
ఎమ్.ఎల్.ఎ మూవీ ఆడియోని ఈ నెల 17న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఆల్ రెడీ రిలీజైన మొదటి పాట మెప్పిస్తోంది. ఇప్పుడు 17న మొత్తం సాంగ్స్ ని విడుదల చేయబోతున్నారు. ఓ రకంగా ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాంటిదని చెప్పాలి. కళ్యాణ్ రామ్, కాజల్ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!







