సచిన్ సినిమాకు అవార్డు
- March 11, 2018
ముంబయి: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సచిన్ -ఏ బిలియన్ డ్రీమ్స్ చిత్రానికి ప్రతిష్టాత్మక అవార్డు వచ్చింది. ది ఎక్లాడ్ గ్లోబల్ ఫిల్మ్ కాంపిటీషన్-2018లో భాగంగా 2017లో వచ్చిన ఏ బిలియన్ డ్రీమ్స్ సినిమా ఎక్సలెన్స్ అవార్డు దక్కించుకుంది. ఈ విషయాన్ని బాలీవుడు విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సచిన్ క్రికెట్ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంతో తెరకెక్కిన చిత్రానికి జేమ్స్ ఎర్సీన్ దర్శకత్వం వహించగా.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమా ఐదు భాషలు హిందీ, ఇంగ్లీష్, మరాఠి, తెలుగు, తమిళంలో 2017 మే 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు అవార్డు రావడంతో అభిమానులు సచిన్‌కు అభినందనలు తెలుపుతున్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







