హైదరాబాద్‌ పోలీసులు డ్రింక్‌ అండ్ డ్రైవ్‌పై కొన్ని ఆసక్తికర ట్వీట్‌లు

- March 11, 2018 , by Maagulf
హైదరాబాద్‌ పోలీసులు డ్రింక్‌ అండ్ డ్రైవ్‌పై కొన్ని ఆసక్తికర ట్వీట్‌లు

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు సరికొత్తగా ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.. నిబంధనలు పాటించకపోతే జైల్లో పెడతాం అని వార్నింగ్‌లు ఇవ్వడం లేదు.. రూల్స్‌ గీత దాటితే ఏం జరుగుతుందో వివరిస్తూ.. అందర్నీ అలర్ట్‌ చేస్తున్నారు.. సోషల్‌ మీడియాను అందుకు వేదికగా చేసుకుంటున్నారు.. తాజాగా హైదరాబాద్‌ పోలీసులు  చేసిన కొన్ని ట్వీట్‌లు అత్యంత ఆసక్తిగా మారాయి..

సాంబార్‌ అన్నం కన్నా సాంబర్‌ ఇడ్లీ మంచిది కదా అంటూ ట్వీట్‌ చేసి అందర్నీ ఆలోచించేలా చేశారు. ఈ సాంబార్‌ ఇట్లీ.. సాంబార్‌ అన్నం ఏంటి అని డౌట్‌ పడుతున్నారా?.. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌తో జైల్లోకి వెళ్లి.. జైలు కూడు తినడం కన్నా.. హ్యాపీగా సాంబార్‌ ఇడ్లీ తినడం మంచిది అంటూ ఇలా ఫన్నీ ట్వీట్‌ చేశారు..

హైదరాబాద్‌లో హెల్మెట్‌ నిబంధన బాగా పని చేస్తోంది.. ఎందుకంటే ఇప్పుడే నా హెల్మెట్‌ పోయిందంటూ సరదగా చమత్కరిస్తూ మరో ట్వీట్‌ చేశారు.. డ్రింక్‌ చేసి డ్రైవ్‌ చేసే ఉత్తమ పురుషులకు ఈ ట్వీట్‌ను ట్యాగ్‌ చేయండి అంటూ ఇంకో సెటైర్‌ వేశారు..
డియర్‌ అమ్మాయిలు.. ఆడవాళ్లు వాహనాలపై వెళ్లేటప్పుడు మీ దుపట్టాలు.. చీరలను జాగ్తత్తగా కాపాడుకోండి అంటూ మరో అవేరనస్‌ ట్వీట్‌ చేశారు.. తాగి వాహనాలు నడపకండి.. మత్తులో లేకుండా ఉండండి అంటూ ట్వీట్‌ చేశారు..
అక్కడితోనే ఆగక.. ఇవాళ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టు నిర్వహించే ప్రదేశాలు ఇవే అంటూ హింట్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు..

డ్రంక్‌ డ్రైవ్‌లు నిర్వహించే ప్రదేశాలు చెబితే.. ఎవరైనా అటువైపు వెళ్తారా... అందుకే కాసేపు ఆసక్తి కలిగిస్తూ.. కిందని మరో ట్విస్ట్‌ ఇచ్చారు.. సిటీ మొత్తం డ్రంక్‌ డ్రైవ్‌ టెస్టు జరుగుతాయి అంటూ స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు..

హైదరాబాద్‌ పోలీసులు పెడుతున్న ట్వీట్లకు నెటిజన్ల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఎనీ స్పెషల్‌ ప్రోగ్రామ్‌ అని ఓ వ్యక్తి ప్రశ్నిస్తే.. ఏముంది సార్‌ అందరూ రూల్స్‌ ఫాలో అయితే.. అంతా హ్యాపీ.. లేదంటే జైల్లో సాంబార్‌ అన్నం.. ఇజ్జత్‌ పోతుంది అంటూ రిప్లై ఇచ్చారు.. మందు తాగి డ్రైవింగ్‌ చేసిన వాళ్లకు ఇజ్జత్‌ ఏముంటుందని అవతల వ్యక్తి కూఆ సెటైర్‌ వేశాడు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com