'కిరాక్ పార్టీ' ఆడియో విడుదల
- March 11, 2018
హీరో నిఖిల్ కథానాయకుడుగా కన్నడలో వచ్చిన 'కిరిక్ పార్టీ' ని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎకె ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ తెలుగులో 'కిరాక్ పార్టీ' గా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. నిఖిల్ సరసన సంయుక్త హెగ్డే , సిమ్రాన్ పరీంజా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా శరఱ్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు..
యువదర్శకుడు సుధీర్‌వర్మ స్క్రీన్‌ప్లే, మరో యువ దర్శకుడు చందూ మొండేటి సంభాషణలు సమకూర్చారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతునన ఈచిత్రం ఈనెల 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.. ఈచిత్రం ఆడియో వేడుకను విజయవాడలోనిఉషారామా ఇంజనీరింగ్‌కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా అల్లరి నరేష్ బిగ్ సిడిని ఆవిష్కరించారు..
తొలిసిడిని నిర్మాతల్లో ఒకరైన రామబ్రహ్మం సుంకర అందుకున్నారు. చిత్ర నిర్మాత అనిల్ సుంకర మాట్లాడారు.. ఈచిత్రాన్ని మార్చి 16న విడుదల చేయనున్నామన్నారు. అల్లరి నరేష్ మాట్లాడుతూ నిఖిల్‌ను చూసినపుడల్లా డ్యూరో సెల్ బ్యాటరీ గుర్తొస్తుందని, మా ఆహుతి ప్రసాద్ గారి అబ్బాయి కార్తీక్ ఈ చిత్రంలో నటించటం చాలా సంతోషంగా ఉందన్నారు.. కార్యక్రమంలో చిత్ర కథానాయకుడు నిఖిల్, హీరోయిన్ సంయుక్త హెగ్డే, చిత్ర దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి తదితరులు మాట్లాడారు. ఈచిత్రానికి అజనీష్ లోక్నాధ్ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







