నాన్న హంతకులను క్షమించేశాం
- March 11, 2018
'నాన్న చనిపోయిన తర్వాత చాలా ఏళ్ల పాటు బాధపడ్డాం. కానీ ఆయన్ని చంపినవారిని నేను, ప్రియాంక పూర్తిగా క్షమించేశాం' అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ ఉద్వేగానికి లోనయ్యారు. నాన్న చనిపోతారని ముందే తెసునని రాహుల్ వ్యాఖ్యానించారు. తన మాట వినకుండా మృత్యువుకు ఎదురు వెళ్లారని చెబుతూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ సింగపూర్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఐఐఎం పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తన తండ్రి, నానమ్మ మరణాలను ప్రస్తావించారు. తమిళనాడు లోని ఎన్నికల ర్యాలీలో ఎల్టీటీఈ మహిళా ఆత్మాహుతి దాడిలో 21 మే 1991న భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణించిన విషయం తెలిసిందే.
నా తండ్రిని చంపేసిన ఎల్టీటీఈ నేత ప్రభాకరన్ 2009లో చనిపోయినప్పుడు టీవీలో అతను నిర్జీవంగా పడి ఉండటం చూసి నాకు రెండు విషయాలు గుర్తుకు వచ్చాయి. మొదట..ప్రభాకరన్‌ని ఎందుకింత నీచంగా అవమానిస్తున్నారు అనిపించింది. రెండోది..అతను చనిపోవడంతో భార్య, పిల్లలు అనాథలైపోయారని బాధేసింది. ఆ తర్వాత నా సోదరి ప్రియాంకకు ఫోన్ చేశాను. 'నాన్నను హతమార్చిన ప్రభాకరన్ చనిపోయాడు. ఇందుకు నేను సంతోషించాలి. కానీ నాకు ఈ భావనే కలగడంలేదు' అని చెప్పాను. తనకూ అలాగే ఉందని ప్రియాంక నాతో చెప్పింది' అని అప్పటి రోజులను రాహుల్ గుర్తుచేసుకున్నారు. 'రాజకీయాల్లో తప్పుడు వ్యక్తులకు వ్యతిరేకంగా నిలిచినా, దేని గురించైనా గట్టిగా పోరాడినా మనం చనిపోతాం. నా తండ్రి, నానమ్మ చనిపోతారని మేం ముందే ఊహించాం. తాను చనిపోతానని ముందే తెలుసని నానమ్మ నాకు చెప్పింది. 'మీరు చనిపోతారు' అని నేను నాన్నకు చెప్పాను అని కాంగ్రెస్ అధినేత వెల్లడించారు. ఒక మాజీ ప్రధానికి కొడుకుగా, మరొక మాజీ ప్రధానికి మనుమడిగా మీరెప్పుడైనా అధికార జీవితాన్ని కోరుకున్నారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ, 'నాణేనికి మీరెటు వైపు ఉన్నారనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. నేనున్న చోట నాకు అనేక అధికారాలున్నాయి. అయితే, నేను గతుకుల ప్రయాణం చేయట్లేదని చెప్పలేను. నానమ్మ హత్యకు గురైనప్పుడు నాకు పద్నాలుగేళ్ల వయసు. ఆమెను ఎవరైతే చంపారో, వారే రోజూ నాతో బ్యాడ్మింటన్ ఆడేవారు. ఆ తర్వాత నాన్న కూడా హత్యకు గురయ్యాడు. ఉదయం.. మధ్యాహ్నం.. రాత్రి నా చుట్టూ 15 మంది వ్యక్తులు (భద్రత) ఉండేవాళ్లు. కాబట్టి దాన్ని అధికారంగా భావించలేదు. అదొక సంక్లిష్ట పరిస్థితిగానే భావించాను అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







