భార్యతో కలిసి పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేసిన పవన్

- March 11, 2018 , by Maagulf
భార్యతో కలిసి పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేసిన పవన్

అమరావతిలో నివాసానికి భూమిపూజ చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌. పంచెకట్టులో వచ్చి హోమంలో పాల్గొన్నారు.  అమరావతి సమీపంలోని కాజా గ్రామంలో ఇంటితో పాటు, పార్టీ కార్యాలయాన్ని నిర్మించనున్నారు.  ఆరునెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పూజ కోసం పవన్‌,సతీ సమేతంగా నిన్ననే విజయవాడకు చేరుకున్నారు. ఇప్పటి వరకూ హైదరాబాద్‌ నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహించిన జనసేనాని.. ఎన్నికలు సమీపించే సమయానికి అమరావతికి తరలివెళ్లాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆహ్వానాలు పంపారు.

మరోవైపు గుంటూరులో జనసేన ప్లీనరీ కోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంటి భూమిపూజ కోసం గుంటూరు వచ్చిన పవన్‌.. పార్టీ నేతలతో ప్లీనరీ ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట 14 ఎకరాల స్థలంలో.. మార్చి 14న ప్లీనరీ నిర్వహించనున్నారు. ఈ సభకు 13 జిల్లాల నుంచి పెద్దఎత్తున జనం తరలివస్తారని భావిస్తున్నారు. నాలుగు నుంచి ఐదులక్షల మందిని సమీకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com