మహిళలా వస్త్రధారణ: వలసదారుడి అరెస్ట్‌

- March 11, 2018 , by Maagulf
మహిళలా వస్త్రధారణ: వలసదారుడి అరెస్ట్‌

మస్కట్‌: మహిళలా వస్త్రధారణ చేసుకున్న వ్యక్తిని అల్‌ బురైమీలో అరెస్ట్‌ చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ (ఆర్‌ఓపి) వెల్లడించింది. మహిళా దినోత్సవం రోజున, కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం వుండగా, ఓ వ్యక్తి మహిళా వస్త్రధారణతో పార్క్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా అరెస్ట్‌ చేశామని అధికారులు చెప్పారు. అబయా, నికబ్‌ మరియు స్కార్ఫ్‌ని నిందితుడు ధరించాడు నిందితుడి గురించిన సమాచారమిచ్చినందుకు ఓ మహిళను ఈ సందర్భంగా పోలీసులు అభినందించారు. నిందితుడ్ని తదుపరి విచారణ నిమిత్తం సంబంధిత అధికారులకు అప్పగించారు. మహిళలా వస్త్రధారణ చేసుకున్నందుకుగాను నెల రోజుల జైలు శిక్ష, అలాగే 300 ఒమన్‌ రియాల్స్‌ జరీమానా విధించే అవకాశం ఉంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com