ముంబైలో హైటెన్షన్..!

- March 12, 2018 , by Maagulf
ముంబైలో హైటెన్షన్..!

ముంబైలో హైటెన్షన్ మొదలయ్యింది. రైతు సమస్యలను పరిష్కరించాలంటూ ఆరు రోజుల పాటు 180 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ముంబై చేరుకున్న అన్నదాతలు.. మరికాసేపట్లో మహారాష్ట్ర అసెంబ్లీని ముట్టడించనున్నారు. ఆజాద్‌ మైదానంలో దాదాపు 50 వేల మంది రైతులు నేతల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. పరీక్షలు జరుగుతుండడంతో.. ఉదయం 11 గంటల తర్వాత మైదానం నుంచి కదులుతామంటూ ఇప్పటికే ప్రకటించారు రైతు సంఘం నేతలు. అటు.. చర్చలతో సమస్యను పరిష్కరించుకుందామంటూ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. రైతు సంఘం నేతలను చర్చల కోసం విధాన్‌ భవన్‌కు ఆహ్వానించారు.

విదర్భ నుంచి రైతుల యాత్ర మొదలైనప్పటి నుంచీ ఎలాంటి నిర్భంధాలు విధించని మహారాష్ట్ర ప్రభుత్వం, ఆజాద్‌ మైదానం నుంచి మాత్రం వారిని బయటకు రానివ్వకూడదని భావిస్తోంది. అసెంబ్లీను చుట్టుముడితే,  శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ఆందోళన చెందుతున్నారు పోలీసులు. అయితే, ఈ ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న అఖిల భారత కిసాన్‌ సభ మాత్రం, ముంబై వాసులకు ఎలాంటి ఇబ్బంది రానివ్వమని చెబుతోంది. అందరికీ అన్నం పెట్టే రైతు సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఆందోళనలకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరింది. ముఖ్యమంత్రితో చర్చలు విఫలమైతే గనక, అసెంబ్లీ ముట్టడికి రైతులు వెళ్లే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com