ఉగాదికి నాగ్‌-నాని సినిమా షురూ!

- March 12, 2018 , by Maagulf
ఉగాదికి నాగ్‌-నాని సినిమా షురూ!

కింగ్‌ అక్కినేని నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని హీరోలుగా ఓ మల్టీస్టారర్‌ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్‌ పతాకంపై టి.శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది . ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ మార్చి 18వ తేదీ (ఉగాది పండగ రోజు) నుంచి జరగనుందని చిత్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ తెలిపారు. 

అమెరికాలో మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ :
ఈ సందర్భంగా సి.అశ్వనీదత్‌ మాట్లాడుతూ.. ' మా వైజయంతి పతాకంపై మణిశర్మ చేసిన సినిమాలన్నీ మ్యూజికల్‌గా పెద్ద హిట్స్‌ అయ్యాయి. ఈ సినిమాని కూడా హిట్‌ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఈ సినిమాలోని పాటల్ని మణిశర్మ కంపోజ్‌ చేస్తున్నారు. మూడు పాటలకు సంబంధించిన మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ అక్కడ జరుగుతున్నాయి. మార్చి 18వ తేదీ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరగనుంది. మా సంస్థలో ఎన్నో మల్టీస్టారర్స్‌ వచ్చాయి. అవన్నీ కమర్షియల్‌గా ఘన విజయాల్ని అందుకున్నాయి. ఇప్పుడు నాగార్జున, నాని కాంబినేషన్‌లో చేస్తున్న మల్టీస్టారర్‌ కూడా పెద్ద హిట్టై, మరింత మంచి పేరు తెస్తుంది' అని ఆశాభావం వ్యక్తంచేశారు. టి.శ్రీరామ్‌ ఆదిత్య మాట్లాడుతూ.. 'వినోదాత్మకంగా సాగే విభిన్నమైన కథ ఇది. నాగార్జున, నాని వంటి హీరోలతో వైజయంతి పతాకంలో ఈ మల్టీస్టారర్‌ చెయ్యడం చాలా ఆనందంగా ఉంది' అని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com