చర్చిపై పిడుగు..16మంది మృతి, 140 మందికి గాయాలు
- March 12, 2018
పిడుగుపాటు కారణంగా ఒక చర్చిలో 16మంది చనిపోయిన సంఘటన రువాండాలోని యారుగురులో చోటు చేసుకుంది. ఘటనలో గాయాలపాలైనవారి సంఖ్య 140వరకు ఉన్నట్టు తెలుస్తోంది. శనివారం ఉదయం ఈ ప్రమాదం సంభవించింది.
ప్రత్యేక ప్రార్థనల కోసం కొన్ని వందలమది శనివారం చర్చికి వచ్చారు. ప్రార్థనలు జరుగుతున్న సమయంలోనే చర్చిపై పిడుగు పడింది. దీంతో చర్చిలో చాలామంది సజీవ దహనమయ్యారు. మిగతావారు హాహాకారాలు చేస్తూ భయంతో బిక్కచచ్చిపోయారు.
పిడుగుపాటుకు గురికాకుండా చర్చిలో ఎలాంటి ఏర్పాట్లు లేవని, కనీసం విద్యుత్ సదుపాయం కూడా అక్కడ లేదని చెబుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..