రజినీనైనా విమర్శించటానికి వెనుకాడను: కమల్
- March 13, 2018
చెన్నై: రజినీ రాజకీయ పార్టీ విధానాలు, సిద్ధాంతాలు సక్రమంగా లేకపోతే ఆయనను విమర్శించడానికి మొహమాటపడబోనని 'మక్కల్ నీతి మయ్యం' పార్టీ అధినేత కమల్‌హాసన్ స్పష్టం చేశారు. అయితే రజినీని రాజకీయంగానే విమర్శిస్తానని, వ్యక్తిగత విమర్శలకు దిగనని కమల్ తేల్చి చెప్పారు. ఓ తమిళ చానల్ ఏర్పాటు చేసిన వేడుకలో మాట్లాడుతూ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల్లోకి రజినీ రాకను ఆయన ఆహ్వానించారు. ప్రజల సంక్షేమమే తమ పార్టీ ప్రధాన సిద్ధాంతమని ఇప్పటికే ప్రకటించామని, రజినీ పార్టీ సిద్ధాంతాలు ఎలా ఉంటాయో చూద్దామని కమల్ వ్యాఖ్యానించారు. సిద్ధాంతపరంగా ఏవైనా విభేదాలొస్తే రజినీని విమర్శిస్తానని, అది తమ పార్టీ హుందాతనమని ఆయన తెలిపారు. రాజకీయ సిద్ధాంతాలు సరైనవి కాకపోతే ఏ పార్టీని విమర్శించడానికీ వెనకాడబోనని కమల్‌హాసన్ స్పష్టం చేశారు. రజినీకాంత్ కూడా రాజకీయ పార్టీని స్థాపించి.. ప్రజలకు సేవ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. నటనలో ప్రేక్షకులతో జేజేలు పలికించుకున్న వీరిద్దరూ రాజకీయాల్లో ఏ మేరకు రాణిస్తారోనన్న ఉత్కంఠ తమిళ ప్రజల్లో నెలకొంది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!