బాలయ్య సరసన విద్య బాలన్?!
- March 13, 2018
నందమూరి అభిమానులందరి దృష్టి ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ పైనే వుంది. ఈ కారణంగానే ఈ సినిమాకి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి వాళ్లంతా ఆసక్తిని చూపుతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషించనుండగా, ఎన్టీఆర్ సతీమణి పాత్రను ఎవరు పోషించనున్నారనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.
నిజ జీవిత పాత్రలను, బరువైన పాత్రలను పోషించడంలో విద్యాబాలన్ అసమానమైన ప్రతిభను కనబరుస్తూ ఉంటారు. ఆ తరహా పాత్రలకు ఆమె నిండుదనాన్ని తీసుకొస్తూ ఉంటారు. అందువల్లనే ఆమెను దర్శకుడు తేజ కలిసి కథ .. పాత్ర గురించి వివరించారట. దాంతో వెంటనే ఈ సినిమా చేయడానికి విద్యాబాలన్ అంగీకరించారని చెబుతున్నారు. సాయి కొర్రపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాను, ఈ నెల 29వ తేదీన ప్రారంభించనున్నారు. ఆ రోజున ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు తెలిసే ఛాన్స్ వుంది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!