ఇండస్ట్రీ పై విరుచుకుపడ్డ ఆండ్రియా
- March 13, 2018
సినీ ఇండస్ట్రీలోని వ్యవహార తీరుపై ఇప్పటికే చాలా మంది ముద్దుగుమ్మలు తమ తమ భావాలను వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. 'మేల్ డామినేషన్ ఇండస్ట్రీ'గా టాక్ సంపాదించుకున్న సినీ పరిశ్రమలో హీరోయిన్లు ఎవరైనా ఎదగాలంటే. హీరోల పక్కన ప్రాధాన్యత లేని రోల్స్ చేసి తైతక్కలాడాలని, అప్పుడే వారికి గుర్తింపు లభిస్తుందని 'యుగానికొక్కడు' సినిమా ద్వారా పరిచయం అయిన ఆండ్రియా, మహిళా దినోత్సవం సందర్భంగా పాల్గొన్న ఓ ఈవెంట్ లో విమర్శల వర్షం కురిపించింది.
తాను 'తారామణి' సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదని, అదే విజయ్ సరసన నాలుగు పాటల్లో డ్యాన్స్ చేసే హీరోయిన్ అయితే 'ఫట్ ఫట్ ఫట్ మని' అవకాశాలు వచ్చేస్తాయని, ఏ హీరోయిన్ అయినా షారుఖ్, సల్మాన్, రజనీ, అజిత్, విజయ్ వంటి హీరోల సరసన చేస్తేనే గుర్తింపు వస్తుందని, చివరికి బాలీవుడ్ లో దీపికా అయినా ముందుగా షారుఖ్ పక్కన నటించడం వలనే దీపికా పదుకునేగా మారిందని ఆవేశంగా ప్రసంగించింది.
అలాగే నయనతార కూడా రజనీ, విజయ్, సూర్య వంటి హీరోల సరసన నటించిన తర్వాతే గుర్తింపు లభించిందని, ఒక మామూలు ఆండ్రియా, స్టార్ హీరోయిన్ ఆండ్రియాగా ఎందుకు రాలేకపోతోందని, ఇదే తన ఆవేదనగా చెప్పుకొచ్చింది. నడుము ఉపుతూ, ఎక్స్ పోజింగ్ చేసే డ్రెస్ లు వేసుకోమని ఆఫర్లు వస్తే తాను చేయబోనని, అవసరమైతే తాను నగ్నంగా నటించడానికి కూడా సిద్ధం కానీ, అది పాత్రకు అనుగుణంగా ఉండాలని అంటూ 'మేల్ డామినేషన్' ఇండస్ట్రీపై విమర్శల జడివాన కురిపించింది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







