డ్రైవింగ్ లైసెన్సులను పరిశీలించేందుకు ఒక శాశ్వత ప్యానెల్

- March 14, 2018 , by Maagulf
డ్రైవింగ్ లైసెన్సులను  పరిశీలించేందుకు ఒక శాశ్వత ప్యానెల్

కువైట్ : చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ప్రవాసీయుల డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయో  లేదో పరిశోధించడానికి ఒక శాశ్వత ప్యానెల్ ను  ఏర్పాటు చేయడానికి ఒక ప్రతిపాదనను జాతీయ అసెంబ్లీ అంతర్గత మరియు రక్షణ సంఘం ఆమోదించింది. ఈ ప్రతిపాదన ప్రకారం, జారీ చేసిన లేదా పునరుద్ధరణ సమయంలో ప్రవాసీయులకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్సుల అన్నింటిని కమిటీ పరిశీలిస్తుంది. . కువైట్ ట్రాఫిక్ చట్టం ప్రకారం, కువైట్ లో నివసిస్తున్న మరియు పనిచేస్తున్న ప్రవాసీయులు ఒక డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోగల పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి కనీసం 600 కువైట్ దినార్ల నెలసరి జీతం సంపాదించి, కువైట్ లో  రెండు సంవత్సరాల నివాసం పూర్తి చేసి ఉండటమే కాక లైసెన్స్ పొందగోరేవారు విద్యార్హతగా ఒక విశ్వవిద్యాలయ డిగ్రీ కలిగి ఉండాలి . అయితే, కువైట్ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్ధులు, కుటుంబాల ప్రైవేట్ డ్రైవర్లు, వైద్యులు, న్యాయమూర్తులు, ఇంజనీర్లు మరియు పలు ఇతర సీనియర్ నిపుణులు, పిల్లలతో గృహిణులు, రాయబారులు మరియు ఇతరులుగా పనిచేసేవారితో పాటు అనేక మినహాయింపులు ఉన్నాయి. కానీ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వారు మినహాయింపులలో ఒకదానిపై ఆధారపడి వారు ఆ పరిస్థితులను కోల్పోయిన తర్వాత లైసెన్స్ ను వదులుకోవాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com