షార్జా ఎయిర్‌పోర్టులో ఉన్నట్టుండి కుప్పకూలి చనిపోయిన ప్రయాణికుడు
- March 15, 2018
షార్జా: వెంటాడే మృత్యువు ..ఎక్కడున్నా కావాలని అనుకొంటే తన వెంట ఆ వ్యక్తి ప్రాణాలు తీసుకుపోతుంది షార్జా ఎయిర్‌పోర్ట్‌లో ఓ వ్యక్తి ఆకస్మికంగా కుప్పకూలి చనిపోయాడు. ఇరాక్ నుంచి వయా బంగ్లాదేశ్ వెళ్తున్నఆ ప్రయాణికుడు షార్జా ఎయిర్‌పోర్ట్‌లో విమానం దిగాడు. ముందుకు నడిచి వెళుతున్న ఆయన కొద్దిసేపటి తర్వాత కింద పడిపోయాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ సిబ్బంది బాధిత వ్యక్తిని దగ్గరలోని ఓ హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు కానీ అప్పటికే ఆ ప్రయాణికుడుమృతి చెందాడని వైద్యులు ప్రకటించారు. ఆయన పార్దీవ దేహాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించామని, మృతికి గల కారణాన్ని పరిశోధిస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మృతుని వివరాలు తెలుసుకుని కుటుంబ సభ్యులకు ఈ సమాచారం అందచేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!







