అరుదైన వ్యాధితో 'రెడ్ హ్యాండెడ్' బాలిక పోరాటం
- March 15, 2018
దుబాయ్‌కి చెందిన 10 ఏళ్ళ బాలిక అరుదైన వ్యాధితో బాధపడ్తోంది. అరబ్ ప్రపంచంలో ఈ బాలికకు మాత్రమే ఈ అరుదైన వ్యాధి సోకింది. అత్యంత అరుదైన ఈ వ్యాధి లక్షణమేంటంటే, తీవ్రమైన నొప్పులు, వాపులతో బాధపడటం. చేతులు, కాళ్ళు ఎర్రగా మారిపోతాయి. 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో భరించలేని నొప్పిని అనుభవిస్తోంది ఈ బాలిక. లీన్ అనే ఈ బాలిక, 8వ పుట్టినరోజు వరకూ అందరిలానే ఆరోగ్యంగా వుంది. అయితే 8వ పుట్టినరోజు తర్వాతి రోజున ఎర్రబడ్డ కాళ్ళు, చేతులతో తల్లిదండ్రుల్ని షాక్‌కి గురిచేసింది లీన్. ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళగా, డాక్టర్లు ఆమె ఏ వ్యాధితో బాధపడ్తోందో వెంటనే గుర్తించలేకపోయారు. ఆ తర్వాత పల్మార్ ప్టాఆర్ ఎరిత్రోడైసెస్తియా (హ్యాండ్ ఫుట్ సిండ్రోమ్) అనే వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 20 మంది మాత్రమే ఈ తరహా వ్యాధితో బాధపడుతున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన డాక్టర్లతో మాట్లాడుతున్నామనీ, పలు టెస్టులు జరిగినా వ్యాధి కారణమేంటో తెలియలేదని లీన్ తల్లి యుమ్నా చెప్పారు. యుమ్నా ఆమె కుటుంబం యూఏఈలో 4 ఏళ్ళుగా వుంటున్నారు. వ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు లీన్ 'ది రెడ్ హ్యాండ్ ఛాలెంజ్' పేరుతో ప్రచారం నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







