మస్కట్‌లో ఫ్లై ఓవర్‌ మూసివేత

- March 15, 2018 , by Maagulf
మస్కట్‌లో ఫ్లై ఓవర్‌ మూసివేత

మస్కట్‌: కురుమ్‌ ఫ్లై ఓవర్‌ మంగళవారం నుంచి ఆదివారం వరకు మూసివేయబడ్తుందని మస్కట్‌ మునిసిపాలిటీ వెల్లడించింది. మెయిన్‌టెనెన్స్‌ వర్క్‌లో భాగంగా ఎయిర్‌ పోర్ట్‌ వైపు వెళ్ళే మార్గాన్ని మూసివేస్తారు. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌తో కలిసి మస్కట్‌ మునిసిపాలిటీ కుర్రమ్‌ బ్రిడ్జిపై మూసివేత నిర్ణయాన్ని అమలు చేస్తోందనీ, ఎగ్జిట్‌ వైపుగా రోడ్డు మూసివేయబడ్తుందనీ వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్‌ నిబంధనల్ని పాటించడంతోపాటుగా, అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మార్గంలో వెళ్ళాలనుకునేవారు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాల్సి వుంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com