లక్ష్మీస్ ఎన్టీఆర్ పై సంచలన ప్రకటన చేసిన:ఆర్.జి.వి
- March 16, 2018
రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు.. ఇక బయోపిక్ లను తనదైన శైలిలో తెరకెక్కిస్తాడు.. తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ అంటూ ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసి సంచలనం సృష్టించాడు.
దానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే పేరు పెట్టాడు.. ఆ సినిమాను వైసీపీ నేత రాకేశ్ రెడ్డి నిర్మిస్తాడు అని కూడా ప్రకటించాడు. తాజాగా వర్మ అసహనం వ్యక్తం చేస్తూ..ఆయనతో సినిమా తీయడం లేదు అని సంచలన ప్రకట చేశారు. ఈ విషయం తెలియజేస్తూ.. ఓ వీడియో లింక్ ను కూడా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు వర్మ.. రాకేశ్ రెడ్డి చెప్పినవన్నీ అబద్దలు అని.. ఈ అబద్ధాలు ఎవర్ని మోసం చెయ్యడానికి అనేది ఆయనకే తెలియాలి అని.. ఇక నుంచి ఆయనకు నాకు ఏ విధమైన సంబంధం లేదని ఈ నోట్ రిలీజ్ చేస్తున్నట్లు వర్మ ప్రకటించారు. అంతేకాదు. తను నాగార్జున తో చేస్తున్న ఆఫీసర్ సినిమా తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం 2018 ఏప్రిల్ లో మొదలు పెట్టి.. సెప్టెంబర్ నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొని రానున్నట్లు చెప్పాడు. మరి ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ కు నిర్మాత నటులు ఎవరో వర్మ ప్రకటించాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు
- తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
- న్యూ ఇయర్ పార్టీలకు కఠిన నిబంధనలు విడుదల చేసిన పోలీస్
- తిరుమల భక్తులకు శుభవార్త..
- జనవరి 2 నుంచి విజయవాడలో బుక్ ఫెస్టివల్
- అక్టోబర్ లో ఇంపోర్ట్స్ లో బహ్రెయిన్ రికార్డు..!!
- దాడిని ఖండించిన ఎనిమిది అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- యూఏఈ అస్థిర వాతావరణం..భారీ వర్షాలు..!!
- భారత్ ఆర్కియాలజీ గ్యాలరీలో కువైట్ వస్తువులు..!!
- కస్టమ్స్ పోర్టులలో 1,145 అక్రమ వస్తువులు సీజ్..!!







