అల్ తఖీరా రోడ్డుపై ట్రాఫిక్ మళ్ళింపు

- March 16, 2018 , by Maagulf
అల్ తఖీరా రోడ్డుపై ట్రాఫిక్ మళ్ళింపు

దోహా : అల్ తఖైర రోడ్డు రెండు దిశలలో ఒక దారిని మూసివేస్తామని అస్ఘాగల్ చెప్పారు. అల్ ఖోర్ కమ్యూనిటీ రౌండ్ అబౌట్ మరియు అల్ మీరా హైపర్ మార్కెట్  జంక్షన్ ల మధ్య1 కిలోమీటర్ల దూరం కోసం ఆల్ ఖోర్లో మూసివేత నేడు శుక్రవారం (మార్చి 16) మొదలై మూడు నెలల పాటు కొనసాగుతుందని , ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ పేర్కొంది. దీనిని సమన్వయపర్చేందుకు అల్ తఖైర రహదారిపై మిగిలిన లైనులో ట్రాఫిక్ మళ్ళించబడుతుంది. ఎగువ చూపిన మ్యాప్ లో  చూపిన విధంగా ట్రాఫిక్ మార్పు ఉంటుంది.  అల్ తఖీరా మురుగునీటిని పనుల రూపకల్పన, నిర్మాణ పనులు నిర్వహించడానికి, పంపింగ్ స్టేషన్ మరియు అసోసియేటెడ్ పైప్ లైన్ల మార్పిడి ఈ కాలంలో సాధ్యపడుతుంది. ఈ మూసివేత కాలంలో అష్ఘల్ వాహనదారుల అవగాహన కోసం పలు చోట్ల రోడ్డు సంకేతాలను ఏర్పాటు చేస్తుంది. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు అధికార పరిమితులకు  కట్టుబడి సక్రమ ట్రాఫిక్ కొనసాగేలా సహకరించాలని రహదారి వినియోగదారులను అందరిని అభ్యర్ధించింది. సురక్షిత ప్రయాణం ఈ మార్గంలో ఉండేందుకు భద్రతకు హామీ ఇవ్వడానికి రహదారి చిహ్నాలను అనుసరించాలని వివిధ వాహనదారులను కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com