పెయింటర్ ను అంగరక్షకులతో కొట్టించిన సౌదీ యువరాణి అరెస్టుకు ఆదేశాలు
- March 16, 2018
రియాద్ : ' రాజు తలచుకొంటే ..దెబ్బలకు కొదువేముందని ? ' మన తెలుగునాట ఓ సామెత ... అయితే రాణిగారు ఆగ్రహిస్తే ...ఆ మోతాదు మరీ ఎక్కువగా ఉంటుందని ఫ్రాన్స్ లో రుజువయ్యింది .సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ సోదరి సౌదీ యువరాణి హస్సా బింట్ సల్మాన్‌ను అరెస్ట్ చేయాలంటూ ఫ్రాన్స్ జడ్జీ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు.ఆమె ఫ్రాన్స్‌లోని తన ఇంట్లో పని చేసిన వ్యక్తిని బాడీగార్డుతో కొట్టించడమే కాకుండా బాధితుడి పట్ల యువరాణి దారుణంగా ప్రవర్తించారు. కేవలం తనను ఫోటో తీశాడనే కారణంగా ఆగ్రహంతో ఆమె పెయింటింగ్ పనిచేసేందుకు వచ్చిన వ్యక్తిని ' కుక్క ' అని పిలవడమే కాకుండా ఆ వ్యక్తిని తన పాదాలకు ముద్దుపెట్టాలని, లేకపోతే చంపేస్తానని హెచ్చరించారు. తీవ్రంగా హింసించిన తర్వాత కొన్ని గంటల తర్వాత బాధితుడిని విడిచిపెట్టారు. 2016 సెప్టెంబర్‌లో జరిగిన ఈ ఘటనపై ఫ్రాన్స్‌లో కేసు నమోదైంది. యువరాణిని అరెస్ట్ చేయాలంటూ ఫ్రాన్స్ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కానీ ఈ కేసుపై విచారణ జరగాలంటే దౌత్యపరమైన నియమాలు పాటించాలని పారిస్‌లోని సౌదీ రాయబారి అధికారులు అడ్డుతగలడంతో కేసు విచారణలో జాప్యం ఏర్పడింది. కానీ ఇటీవలే సౌదీ యువరాజు ఫ్రాన్స్‌లో పర్యటించిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన చర్చలు జరిగిగాయని వార్తలు వెలువడుతున్నాయి. ఈ కేసుపై ఇరు దేశాల అధినేతల మధ్య చర్చలు జరిగాయని ఫ్రాన్స్, అంతర్జాతీయ మీడియా కధనాలు వెలువడుతున్నాయి. తన ఫోటోలను మీడియాకు విక్రయించేందుకు ఆ వ్యక్తి ఫోటోలు తీశాడని అప్పట్లో యువరాణి వాపోయారు.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!







