విద్యార్థిని బ్యాగ్ లో నరకబడిన గొర్రె తల..పాఠశాలలో పరుగులు పెట్టిన పిల్లలు
- March 16, 2018
కువైట్:మోటు ఆకతాయి ఎవరో మొత్తం పాఠశాలను పరుగులు పెట్టించాడు. కువైట్ లో ఒక హైస్కూల్ విద్యార్ధిని బ్యాగ్ లో చంపబడిన ఒక గొర్రెల తలను కనుగొనడంతో విద్యార్థులు భయంతో కంగారుపడిపోయారు. అంతే కాకుండా ఓ కాగితం చీటీ అందులో ఈ విధంగా రాయబడి "ఈరోజు గొర్రెపిల్ల తల నీ బ్యాగ్ లో ఉంది. ఆ తల రేపు నీదే అవుతుంది." అని రాయబడి ఉండటంతో దీంతో పాఠశాల తరగతి నుంచి పలువురు విద్యార్థినులు బైటకు పరుగులు తీశారు. ముబారక్ అల్-కబీర్ పాఠశాలలో గురువారం ఈ ఘటన జరిగింది. ఆ విద్యార్థిని బ్యాగ్ నుండి రక్తంతో తడిచిన గొర్రె తలని తొలగించినప్పుడు పాఠశాలలో పిల్లలు భయభ్రాంతులకు గురయ్యారు. వారిలో కొందరు ఆడపిల్లలు మూర్ఛ పోవడం సైతం జరిగిందని సమాచారం. ఈ విషయం పాఠశాల ప్రధానోపాధ్యాయుని దృష్టికి తీసుకెళ్ళారు. గొర్రె తలను చెత్త బుట్టలో పెట్టి పాఠశాల కంచె వెలుపల విసిరివేయమని ఆమె ఆదేశించింది. ముబారక్ అల్ కబీర్ జోన్ డైరెక్టర్ ఈ ఘటన గూర్చి మన్సూర్ అల్-డైహని పాఠశాలను సందర్శించి, ఆ గొఱ్ఱెతల విషయమై దర్యాప్తు కోసం న్యాయ వ్యవహారాల శాఖకు పిర్యాదు చేయాలనీ ప్రిన్సిపాల్ కు ఆయన ఆదేశించారు. పాఠశాల ప్రాంగణంలో సరైన పర్యవేక్షణ లేకపోవడం నిఘా కెమెరాల లేకపోవడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుని బాధ్యతపై ఆయన ప్రశ్నించారు. గొఱ్ఱెతల బ్యాగ్ లో ఉంచబడిన విద్యార్థిని తండ్రి తన కుమార్తె భయంతో వణికిపోతుందని సంఘటన గురించి పోలీసులకు పిర్యాదు చేశారు. కాని ముబారక్ అల్ కబీర్ ఎడ్యుకేషనల్ జోన్ లో అధికారులు అంతర్గత దర్యాప్తు ఫలితాల కోసం వేచి ఉండాల్సిందిగా నిశ్చయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. అందుకు బాధ్యుడైన అపరాధిని శిక్షిస్తామని వారు హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!







