మీ సేవకై ..కువైట్ వచ్చామంటున్న ఇరువురిని అరెస్టు చేసిన పోలీసులు

- March 16, 2018 , by Maagulf
మీ సేవకై ..కువైట్ వచ్చామంటున్న ఇరువురిని అరెస్టు చేసిన  పోలీసులు

కువైట్: బతుకుతెరువు కోసం కాక మరో వ్యాపకం మీద కువైట్ వెళ్లిన ఓ ఇరువురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు స్థానిక జబీరియాలో ఒక అపార్ట్మెంట్ అద్దెకు తీసుకొని లోపల గుట్టుగా ఆన్లైన్ లో తమ అసాంఘిక కార్యాకలాపాలకు సామాజిక మాధ్యమాల ద్వారా విస్తరించారు. వారు వీడియోలలో తమ వివరాలను తెలియచేస్తూ ఆసక్తిగల విటులు తమను వెంటనే సంప్రదించవచ్చని తెలిపారు..ఒక రాత్రి తమతో కాలక్షేపం చేస్తే 400 కువైట్ దినార్లను చెల్లించుకోవాల్సివస్తుందని  ఆ వీడియోలో తెలియచేస్తూ, వాస్తవంగా తాము లైంగిక సేవలను అందించడానికి కువైట్ కు వచ్చినట్లు నిజాయితీగా ఆ వీడియోలో తెలిపారు. ఈ వీడియో క్లిప్ పలువురి వద్ద చక్కర్లు కొడుతున్ననేపథ్యంలో అపరాధ పరిశోధకులు (డిటెక్టివ్ లు) సెక్స్ వర్కర్ల విషయమై వెంటనే దర్యాప్తు  ప్రారంభించారు. ఆ సెక్స్ వర్కర్లను పట్టుకొనేందుకు ఒక రహస్య పోలీస్ ను వారి వద్దకు ఒక విటుని మాదిరిగా  పంపించారు. ఆ రహస్య పోలీస్ అక్కడ నుంచి డిటెక్టివ్లకు ఒక సంకేతం ఇచ్చిన తర్వాత, పోలీసులు జబీరియాలో వారు నివసిస్తున్న అపార్ట్మెంట్ కు వచ్చి ఆ ఇద్దరినీ  అరెస్టు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com