వేలానికి అలనాటి నటి శ్రీవిద్య ఇల్లు
- March 17, 2018
అలనాటి నటి శ్రీవిద్య ఇంటిని వేలం వేస్తున్నట్టు ప్రకటించారు ఆదాయ పన్ను శాఖా అధికారులు. శ్రీవిద్యకు చెన్నై, అభిరామపురంలోని సుబ్రమణియంపురం వీధిలో రెండు అంతస్తుల ఫ్లాట్ ఉంది. 2006 లో శ్రీవిద్య అనారోగ్యంతో మరణించారు. దాంతో అప్పటినుంచి ఆ ఇంటిని ఆమె సన్నిహితులు అద్దెకు ఇచ్చారు. ఈ క్రమంలో ఇంటికి కొద్దీ సంవత్సరాలుగా పన్ను చెల్లించడం లేదు.పైగా పన్నుతోపాటు దాని వల్ల వచ్చిన వడ్డీ ఎక్కువ అయింది. పన్ను కట్టమని అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. శ్రీవిద్య సన్నిహితుల నుంచి ఎంతకీ స్పందన రాకపోవడంతో ఇంటిని వేలం వేయాలని నిర్ణయించారు 1,250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆ ఫ్లాట్‌ను అధికారులు రూ.1,17,20,000గా ధరగా నిర్ణయించారు. కాగా శ్రీవిద్య తమిళ , మలయాళం తోపాటు తెలుగులో పలు చిత్రాల్లో నటించారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!