దుబాయ్‌లో ఎక్కువ రెస్టారెంట్స్‌ ఎవరివంటే!

- March 17, 2018 , by Maagulf
దుబాయ్‌లో ఎక్కువ రెస్టారెంట్స్‌ ఎవరివంటే!

దుబాయ్‌:దుబాయ్‌లో 6,802 రెస్టారెంట్‌లు మరియు కేఫ్‌లు సుమారు 3 మిలియన్ల రెసిడెంట్స్‌కి అలాగే మిలియన్ల సంఖ్యలో వచ్చే విజిటర్స్‌కీ సేవలందిస్తున్నాయి. ప్రతి ఈటరీ ప్రతిరోజూ 441 మంది రెసిడెంట్స్‌కి సేవలందించడంతోపాటుగా ఏడాదిలో మిలియన్ల సంఖ్యలో వచ్చే టూరిస్టులకీ మంచి ఆహారాన్ని అందిస్తోంది. దుబాయ్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ వెల్లడించిన వివరాల ప్రకారం ఇండియన్స్‌, పాకిస్తానీస్‌ మరియు ఈజిప్టియన్స్‌కి చెందిన రెస్టారెంట్లు ఎమిరేట్‌లో అధికంగా వున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో బ్రిటిష్‌, లెబనీస్‌, కువైటీస్‌, జోర్డానియన్స్‌, అమెరికన్స్‌, సౌదీస్‌, సిరియన్స్‌ వున్నారు. మూడింట ఒక వంతు అంటే 2,265 రెస్టారెంట్లు న్యూ దుబాయ్‌, బుర్జ్‌ ఖలఫా, అల్‌ కరామా ప్రాంతాల్లోనే ఎక్కువగా వున్నాయి. న్యూ దుబాయ్‌ లో 646 రెస్టారెంట్లు, కేఫ్‌లు వున్నాయి. బుర్జ్‌ ఖలీఫాలో 433 వున్నాయి. యూఏఈ రెసిడెంట్స్‌ సరాసరి 50 నుంచి 150 దిర్హామ్‌ల వరకు ఔటింగ్‌లో లంచ్‌ లేదా డిన్నర్‌ కోసం ఖర్చు చేస్తున్నారు విరివిగా. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com