టెక్నీషియన్‌ని ఓవర్‌నైట్ స్టార్‌ని చేసిన ఓ వీడియో.. !
- March 17, 2018
ఒక వీడియో ఓ టెక్నీషియన్‌ని రాత్రి కి రాత్రే స్టార్ ను చేసింది . చైనా లోని షాంఘై కి చెందిన ఓ వ్యక్తి స్థానిక షామెన్ విమానాశ్రయంలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అయితే అక్కడి ఓ విమానానికి సాంకేతిక లోపం తలెత్తడంతో మరమ్మత్తులు చేయడానికి రిపేర్ కంపెనీ నుంచి అధికారులు ఇతడికి కబురు చేశారు. విమానంలోని లోపాలు సవరించడానికి వస్తున్న అతడు స్టైల్‌గా హీరోలా ఉన్నాడు. ఓ స్టార్ హీరోకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్న అతడు జీన్స్, సన్ గ్లాసెస్, హెడ్‌ఫోన్స్ పెట్టుకుని స్టైల్‌గా నడుచుకుంటూ వస్తున్నాడు. అయితే ఈ దృశ్యాన్ని చూసిన విమానంలోని ఓ ప్రయాణికుడు వెంటనే వీడియో తీసి పేస్ బుక్ లో పోస్ట్ చేశాడు దాంతో ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ కంపెనీ లో ఇలా స్టైల్‌గా జీన్స్ ప్యాంట్ వేసుకోవడం నిషేధం దీంతో ఆ కంపెనీ అతడి జీతంలో నుంచి పది శాతం కోత విధించింది. ఈ వివాదం ఫై టెక్నీషియన్ స్పందిస్తూ.. ఈ వీడియో నన్ను ఓవర్‌నైట్ స్టార్‌ని చేసింది. నాకు చాలా సంతోషంగా ఉంది. కొద్ది సమయంలోనే ఇంత ఫేమస్ అవడం సులువేం కాదు. డ్రెస్ కోడ్, ప్రవర్తన విషయంలో కంపెనీ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పూ లేదు. ఈ విషయంలో కంపెనీ రూల్స్‌ని అతిక్రమించడం తప్పే అంటూ వివరణ ఇచ్చుకున్నాడు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!