జేడీ చక్రవరి 'ఉగ్రం' ఫస్ట్‌లుక్ విడుదల

- March 18, 2018 , by Maagulf
జేడీ చక్రవరి 'ఉగ్రం' ఫస్ట్‌లుక్ విడుదల

ఉగాది పర్వదినాన జె.డి.చక్రవర్తి, అమ్మారాజశేఖర్ కాంబినేషన్ లో వస్తున్న 'ఉగ్రం' ఫస్ట్ లుక్ విడుదలనక్షత్ర మీడియా పతాకంపై ఖాసిం సమర్పణలో జె.డి. చక్రవర్తి హీరోగా, అమ్మరాజశేఖర్ దర్శకత్వంలో 'నక్షత్ర' రాజశేఖర్ నిర్మించిన యాక్షన్ కామెడీ థ్రిల్లర్ చిత్రం 'ఉగ్రం'. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉగాది పర్వదినాన ఉగ్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమంలో హీరో జెడి చక్రవర్తితో పాటు చిత్ర యూనిట్ సభ్యులు సంప్రదాయ పంచెకట్టుతో వచ్చి సందడి చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ సమ్మర్ కానుకగా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహలు చేస్తున్నారు.

ఈ సందర్భంగాహీరో జెడి చక్రవర్తి మాట్లాడుతూ... ఉగాది రోజున ఉగ్రం చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నిర్మాతలు చాలా చాలా కష్టపడి ఇష్టపడి చేసిన చిత్రం ఉగ్రం. ఈ సినిమా నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చే చిత్రం అవుతుంది. హీరోయిన్ చాలా బాగా చేసింది. ఆర్.పి. చమ్మక్ చంద్ర క్యారెక్టర్స్ సూపర్బ్ గా వచ్చాయి. ఈ సినిమాకు మీ పుల్ సపోర్ట్ కావాలి. అని అన్నారు.

దర్శకుడు అమ్మా రాజశేఖర్ మాట్లాడుతూ.. ఉగాది పండగకు మా ఉగ్రం చిత్రానికి సంబంధం ఉంది. ఉగాది అంటే షడ్రుచుల సమ్మేళనం. అలాగే మా సినిమాలో కూడా నవ రసాలుంటాయి. అలాంటి ఉగాది రోజున ఉగ్రం ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇక ఉగ్రం చిత్రం మేం అనుకున్నదానికంటే చాలా బాగా వస్తోంది. దానికి కారణం నా గురువు జెడి చక్రవర్తి మెయిన్ రీజన్. రణం తర్వాత నాకు సెకండ్ ఇన్నింగ్స్ ఈ సినిమా. ఆయన క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. ఈ సినిమాతో హీరోయిన్ కు, ఆర్.పి, చమ్మక్ చంద్రకు చాలా మంచి పేరొస్తుంది. మా నిర్మాతల సపోర్ట్ వల్లే ఈ సినిమాను ఇంత బాగా తీయగలుగుతున్నాను.

చిత్ర నిర్మాత నక్షత్ర రాజశేఖర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన జెడి చక్రవర్తి మరో పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్న చిత్రం ఉగ్రం. జె.డి.చక్రవర్తి కెరీర్లో ఉగ్రం ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని ధీమాగా చెప్పగలం. యూత్ ని విపరీతం గా ఆకట్టుకునే చిత్రం గా మా ఉగ్రం వుండబోతుంది అని అన్నారు.

నటీనటులు

జెడి చక్రవర్తి, అక్షిత, మనోజ్ నందం, అక్షత, బెనర్జీ, ఆర్ పి, ఛమ్మక్ చంద్ర, శ్రీరామ్ చంద్ర, టార్జాన్, సంపూర్ణేష్ బాబు, షానీ, రాజు భాయ్

సాంకేతిక వర్గం

మ్యూజిక్ డైరెక్టర్ - జాన్ భూషన్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - చిన్నా

ఆర్ట్ డైరెక్టర్ - వెంకటారే

మేకప్ - శివ

డైలాగ్స్ - రాఘవ.టి

ఎడిటర్ - ఎస్.శ్రీనివాస్

డిఐ, కలర్స్ - రాజు

5.1 మిక్సింగ్ - శ్యామ్

సిజి అండ్ టైటిల్స్ - శ్రీనిథి ఐకాన్ విజువల్స్

కో ప్రొడ్యూసర్ - బండి శివ

ప్రొడ్యూసర్ - నక్షత్ర రాజశేఖర్

డైరెక్టర్ - అమ్మ రాజశేఖర్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com