ఆస్ట్రేలియాతో సిరీస్‌లో టీమిండియా ఉమెన్స్ టీమ్‌కు వైట్‌వాష్
- March 18, 2018
వడోదరా: ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన చివరిదైన మూడో వన్డేలో గెలిచి పరువు నిలబెట్టుకుందామని భావించిన భారత మహిళలకు నిరాశే ఎదురైంది. ఆదివారం ఇక్కడ జరిగిన ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియా 97 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఫలితంగా భారత్‌కు వైట్‌వాష్ తప్పలేదు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 333 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు నిర్దేశించింది. ఓపెనర్ అలైస్సా హేలీ(133) సెంచరీతో సత్తా చాటగా, రాచెల్ హేన్స్(43), ఎల్లీసే పెర్రీ(32), బెత్ మూనీ(34), గార్డ్నర్(35)లు సమయోచితంగా బ్యాటింగ్ చేయడంతో ఆసీస్ 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 332 పరుగులు చేసింది.
ఆపై భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు 44.4 ఓవర్లలో 235 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్లు జెమీమా రోడ్రిగ్స్(42), స్మృతీ మంధాన(52)లు ఆకట్టుకుని తొలి వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. అయితే వీరిద్దరూ వెంట వెంటనే పెవిలియన్‌కు చేరడంతో భారత్ తడబాటుకు లోనైంది. ఆ తర్వాత మిథాలీ రాజ్(21), హర్మన్ ప్రీత్ కౌర్(25)లు ఆశించిన స్థాయిలో రాణించకపోగా, దీప్తి శర్మ(36), సుష్మా వర్మ(30)లు మోస్తరుగా ఫర్వాలేదనిపించారు. వీరిద్దరూ 221 పరుగుల స్కోరు వద్ద వరుసగా అవుట్ కావడంతో పాటు చివరి వరుస క్రీడాకారిణులు ఎవరూ రాణించకపోవడంతో భారత్‌కు భారీ ఓటమి తప్పలేదు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







