ప్రియురాలి క్షేమం కోసం ...సూపర్ మాన్ కాబోయి బ్యాండేజ్ మాన్ అయిన ఓ యువకుడు
- March 19, 2018దుబాయ్: " కామాతురాణాం..నభయం ..నలజ్జ " అని మన పెద్దలు ఊరికే అనలేదు ..దుబాయిలో ఓ యువకుడు (19) అక్షరాలా అది నిజం చేశాడు. ప్రేమ పైత్యం రెండు అంతస్తుల భవనంపై నుంచి కిందకు దూకేలా చేసింది . ఫలితంగా ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. " మా కుటుంబ సభ్యులంతా ఉదయం ప్రార్థనల్లో పాల్గొనేందుకు మసీదుకు వెళ్లారని ఇంట్లో ఎవరూ లేరని ..ఇంటికి వస్తే బాగా ఖుషి చేద్దామని " ఆహ్వానించిన ప్రియురాలిని ఏకాంతంగా కలిసేందుకు షార్జా లోని ఆమె ఇంటికి రెప్పపాటులో చేరుకొన్నాడు. వారు ఇరువురు జోరుగా ప్రేమించుకొంటున్న వేళ..కొద్దిసేపటికే వారిద్దరూ గదిలో ఉండగానే.. ప్రియురాలి తండ్రి ఆకస్మికంగా ఇంటిలోనికి రావడంతో ఆ యువకుని కథ తిరగబడింది. ప్రియురాలి తండ్రి వారు ఉంటున్న గదివైపు వేగంగా రావడం...వెలుపలకు వెళ్లేందుకు ఏకైక మార్గం ఉండటంతో .ప్రియురాలి తండ్రి నుంచి తన్నులు తప్పించుకునేందుకు ఆ ప్రియుడికి ఏం చేయాలో అర్ధం కాక మరో దారి లేక..భవనంపై నుంచి సూపర్ మాన్ మాదిరిగా కిందకు దూకేసాడు. దాంతో కాళ్ళు చేతులు నడుంక తీవ్ర గాయాలై కిందపడి గిల గిల కొట్టుకొంటున్న ఆ ప్రియుడిని స్థానికులు షార్జా ఆసుపత్రిలో చేర్పించారు.
తాజా వార్తలు
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..