యూఏఈలో రెండేళ్ళ చిన్నారిని చిదిమేసిన బస్సు
- March 19, 2018
యూఏఈ:2 ఏళ్ళ ఎమిరేటీ చిన్నారిపై నుంచి స్కూల్ బస్ దూసుకెళ్ళడంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అల్ ధైద్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన ఇంటికి దగ్గర్లోనే ఆ చిన్నారి ఆడుకుంటుంటడగా ఈ ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. మధ్యాహ్నం 2.45 నిమిషాల సమయంలో ఆపరేషన్ రూమ్‌కి ఈ ఘటనపై సమాచారం అందింది. హుటాహుటిన అంబులెన్స్ టీమ్, పెట్రోల్స్, ట్రాఫిక్ ఎక్స్‌పర్ట్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సమీపంలోని నర్సరీలో చదువుతున్న సయీద్‌గా మృతుడ్ని నిర్ధారించారు. అల్ ధైద్ హాస్పిటల్‌కి మృతదేహాన్ని తరలించారు. తల్లిదండ్రులు, వాహనదారులు చిన్నారుల విషయంలో అప్రమత్తంగా వుండాలనీ, రెసిడెన్షియల్ ఏరియాల్లో వాహనాలు నడిపేటప్పుడు నెమ్మదిగా వెళ్ళాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







