అలనాటి హీరోయిన్ హాస్పిటల్ బెడ్‌పై దీనావస్థలో..
- March 20, 2018
వెండి తెరపై వెలుగులు.. తారల తళుకులు.. అభిమానుల మెచ్చుకోలు.. ఫామ్‌లో ఉన్నప్పుడే ఫేమ్ సంపాదించుకోవాలనే తాపత్రయం.. పగలూ రాత్రీ షూటింగులు.. కోరిన నిర్మాతలకు కాల్షీట్లు.. ఇదీ హీరోయిన్ల జీవితం అనుకుంటాం. కానీ నాలుగు సినిమాలు చేతిలో ఉన్నప్పుడే వారి జీవితాలు బావుంటాయి. సినిమాలు లేకపోతే సామాన్యులు పడే కష్టాలే వారినీ పలకరిస్తాయి. బాలీవుడ్ హీరో సల్మాన్‌తో కలిసి 'వీర్‌గతి'లో నటించి బ్లాక్ బస్టర్ కొట్టిన పూజా దద్వార్ అనారోగ్యంతో మంచం పట్టి ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది.
ఆమె పలు హిందీ చిత్రాలు హిందూస్తాన్, సింధూర్ సౌగంధ్ సినిమాల్లోనూ నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఆరు నెలల క్రితం వచ్చిన టీబీ ఆమెను కృంగ దీస్తోంది. చేతిలో చిల్లిగవ్వ లేదు. కుటుంబ సభ్యులు ముంబైలోని శివ్‌ది ఆసుపత్రిలో జాయిన్ చేసి వెళ్లి పోయారు. ఆఖరికి కట్టుకున్న భర్త కూడా కనికరం లేకుండా ఆమెను ఆ పరిస్థితుల్లో వదిలేసి వెళ్లి పోయాడు. టీ తాగడానికి కూడా డబ్బుల్లేవంటూ వాపోతుంది. మీడియాకు తన దీనస్థితిని వెల్లడించింది. సల్మాన్ ఖాన్ సాయం చేస్తాడేమోనని ఎదురు చూస్తోంది. ఉన్న ఆస్తినంతా కుటుంబ సభ్యులు తీసేసుకున్నారని.. ఆఖరికి మెరుగైన చికిత్సకు కూడా డబ్బులు లేని పరిస్థితి తలెత్తిందని వాపోతోంది. ఒకప్పుడు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ సాయం కోసం దీనంగా ఎదురు చూస్తోంది.
తాజా వార్తలు
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!







