ఖరీదైన మొబైల్స్‌ని ఓరెడోతో సులువుగా కొనుగోలు

- March 20, 2018 , by Maagulf
ఖరీదైన మొబైల్స్‌ని ఓరెడోతో సులువుగా కొనుగోలు

దోహా: వినియోగదారులకు ఖరీదైన మొబైల్స్‌ కొనుగోలు చేయడానికి వీలుగా 'ఫ్లెక్సీ పే' అనే కాన్సెప్ట్‌ని ఓరెడూ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓరెడూ షాప్స్‌లో ఈ ఆఫర్‌ అందుబాటులో వుంటుంది. పేమెంట్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ద్వారా, వినియోగదారులు లేటెస్ట్‌ డివైజెస్‌ని తక్కువ ధరకే సొంతం చేసుకుని, మిగిలిన మొత్తాన్ని ఈఎమ్‌ఐల రూపంలో చెల్లించవచ్చు. క్యూఎన్‌బి, కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఖతార్‌ లేదా దోహా బ్యాంక్‌ వినియోగదారులకు ఈ సౌకర్యం కల్పిస్తున్నారు. 500 ఖతారీ రియాల్స్‌ని మించిన ఖరీదైన మొబైల్స్‌కి ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. వాయిదాల పద్ధతిలో చెల్లించేవారికి జీరో పర్సంట్‌ వడ్డీ సౌకర్యం వర్తిస్తుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com